అంబేద్కర్ కు మంత్రి శ్రీధర్ బాబు నివాళి

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్దపల్లి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ర్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ర్ట ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధన రాష్ర్ట ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
