AP | నడివీధి గంగమ్మను దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి

చిత్తూరు, మే 13 (ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరులో నడివీధి గంగమ్మ అమ్మవారిని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా గిరింపేటలో గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎంతో వైభవంగా నిర్వహించే నడివీధి గంగమ్మ జాతరలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. నడివీధి గంగమ్మ ఆలయ ధర్మకర్త, మాజీ శాసనసభ్యులు సీకే బాబు అమ్మవారి ప్రసాదములు మంత్రికి అందజేశారు.

అనంతరం మురుకంబట్టు, దొడ్డిపల్లిలలో ప్రతిష్టించిన అమ్మవార్లను మంత్రి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈసందర్భంగా మంత్రికి, శాసనసభ్యులకు, మేయర్, చుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్సీలను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో మంత్రితో పాటు నగర మేయర్ ఆముద, చుడా చైర్ పర్సన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే దొరబాబు, ఏ.ఎస్. మనోహర్, నాయకులు చల్లా బాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply