Meeting | పీజీఆర్ఎస్‌ను సీరియస్‌గా తీసుకోండి

Meeting | పీజీఆర్ఎస్‌ను సీరియస్‌గా తీసుకోండి
- గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా
Meeting | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో ప్రజల సమస్యలను పరిష్కరించే విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా(Tamim Ansaria) అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో రెవెన్యూ నోడల్(Revenue Nodal) అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అందిన ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య పట్ల పూర్తి అవగాహన(Full understanding) పొందాలన్నారు. పీ.జీ.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదని ప్రతి ఒక్కరూ గ్రహించాలని(To understand) స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి(To solve the problem) కృషి చేయాలని ఆదేశించారు. అర్జీదారునితో మాట్లాడి సమస్య పరిష్కారంకు చర్యలు తీసుకోవాలని తద్వారా మరల సమస్య వచ్చే అవకాశం ఉండదని తెలిపారు. ముందస్తుగా అర్జీదారుల(of the petitioners)కు నోటీస్ జారీ చేసి ప్రక్రియను నిబంధనలు మేరకు చేపట్టాలని అన్నారు.
తహసిల్దార్ లు సోమవారం అందుకున్న అర్జీల పట్ల శుక్రవారం నాటికి స్పష్టమైన సమాచారం కలిగి ఉండాలని చెప్పారు. రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి(A special focus) సారించాలని స్పష్టం చేశారు. బియ్యం కార్డు వంటి సేవా పరమైన అంశాలు వచ్చేటపుడు నేరుగా దరఖాస్తు(Application) చేసుకునే విధంగా అధికారులు సహకరించాలని సూచించారు. బియ్యం కార్డుకు వచ్చే దరఖాస్తులు పౌర సరఫరాల శాఖ పర్యవేక్షణ చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ లు గంగ రాజు, లక్ష్మి కుమారి, శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
