Congress | అవకాశమిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా !

Congress | అవకాశమిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా !


కాంగ్రెస్ పార్టీ లింబూర్ గ్రామ నాయకురాలు సుజాత శివరెడ్డి

డోంగ్లి, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా సుపరిచితుడినైన శివారెడ్డి (Shiva Reddy) భార్య అయినటువంటి నాకు అధిష్టానం అవకాశం ఇస్తే లింబూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నత విద్యావంతురాలైన త‌న‌ను బరిలో నిలిచి గెలుపొంది అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకురాలు సుజాత అన్నారు. తన భర్త శివారెడ్డి ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నాడన్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు సహకారంతో గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం త‌దిత‌ర‌ అభివృద్ధి ప‌నులు చేయించామ‌ని సుజాత శివారెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన భారీవర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు చేర్చి వారి బాగోగులను దగ్గరుండి చూసుకున్నామ‌న్నారు. గ్రామంలో అందరికీ ఆపద సమయంలో, ప్రతీ పనులోను అండగా ఉంటూ అభివృద్ధికి తోడ్పాటునందించామన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే 365 రోజులు ఎప్పుడైనా అందుబాటులో ఉంటామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ సర్పంచిగా అవకాశం ఇస్తే బరిలో నిలుస్తానని తెలిపారు.