సబ్ జైళ్లు ఆధునీకరణ….

ఉమ్మడి జిల్లా సబ్ జైలు జిల్లా అధికారి స్వామి..


నర్సాపురం (ఆంధ్రప్రభ) : ఉమ్మడి జిల్లాలలో గల సబ్ జైళ్లు ను ఆధునీకరణ చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా సబ్ జైలు జిల్లా అధికారి సి హెచ్ ఆర్ వి స్వామి తెలిపారు. స్థానిక సబ్ జైలును శనివారం ఆయన విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోగల సబ్ జైళ్లును పూర్తి స్థాయి వసతులను కల్పించే విధంగా ఆధునీకరణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే నర్సాపురం సబ్ జైలు పరిశీలనకు వచ్చినట్లు ఆయన చెప్పారు.

మహిళా ఖైదీలు, ట్రాన్స్ జెండర్ ఖైదీలను ఉంచే విధంగా మార్పులు చేస్తున్నట్లు వివరించారు. కిచెన్, స్టార్ రూమ్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నర్సాపురం సబ్ జైలు 28సెంట్లు విస్తీర్ణం లో ఉందని దారి ఎలైన్మెంట్, డబుల్ గేట్ ఏర్పాటు తదితర పనులు చేపట్టాలని యోచనలో ఉందన్నారు. సబ్ జైళ్లు లోపలే గాకుండా పరిసర ప్రాంతాలతో బాటు సబ్ జైలు పైనుంచి కూడా 24గంటలు పహారా కాసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

భీమవరం సబ్ జైలు పనులు పూర్తయ్యాయని, తణుకు లో మోడల్ జైలు ఉందన్నారు. చింతలపూడి సబ్ జైలు బ్రిటిష్ కాలం లోనిదని, 53 సెంట్లు విస్తీర్ణం లో ఉందని చెప్పారు. తాడేపల్లి గూడెం, కొవ్వూరు సబ్ జైళ్లు కొరకు పెద్ద మొత్తంలో భూ సేకరణ జరుగుతుందని వివరించారు. తాడేపల్లిగూడెం లో మూడు ఎకరాల భూ సేకరణ జరిగిందని, లోపలి ప్రాంతంలో ఉన్నందున ఆలోచిస్తున్నట్లు చెప్పారు. సబ్ జైలు పరిసర ప్రాంతాల్లో కోర్టు, న్యాయ మూర్తులు నివాస భవన సముదాయాలు, తహసీల్దార్ కార్యాలయం ఉన్నందున న్యాయమూర్తి, తహసిల్దార్ ల సమక్షంలో దారి స్థలంను పరిశీలించినట్లు స్వామి తెలిపారు.