మందుబాబులకు అడ్డాగా ప్రాధమిక పాఠశాల

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : నేరేడుచర్ల పట్టణ పరిధిలోని ప్రాధమిక పాఠశాల అసాంఘిక కార్యక్రమాలకు, మందుబాబులకు నిలయంగా మారింది. నిత్యం జనసంచారం కలిగిన ప్రాంతంలో పాఠశాల ఉన్నప్పటికీ కొంత మంది మందుబాబులు పాఠశాల ఆవరణలోనే రాత్రివేళ మధ్యం సేవిస్తూ కాళీ బాటిళ్ళు సైతం విచ్చలవిడిగా అక్కడే వదిలి వేస్తున్నారు. సరస్వతి నిలయంలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల చుట్టూ ప్రహరీ గోడలు ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు తరచూ చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇలాంటి ఆకతాయిలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.