జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శిగా మహేష్ యాదవ్

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శిగా మహేష్ యాదవ్
చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలోని కాల్వపల్లి కి చెందిన పంచిక మహేష్ యాదవ్ ,జాతీయ బీసీ సంక్షేమ సంఘం భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నియమాక ఉత్తర్వుల పత్రం అందజేశారు. గురువారం హైదరాబాదులో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాములు యాదవ్, అధ్యక్షతన బిసి అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య , ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పాల్గొని మాట్లాడారు .గత కొన్ని సంవత్సరాలుగా బీసీ సమాజ అభ్యున్నతి కోసం మహేష్ యాదవ్ చేస్తున్న సేవలు, అంకితభావానికి గుర్తింపుగా పదవి లభించిందన్నారు, అనంతరం భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమించబడ్డ మహేష్ యాదవ్ మాట్లాడుతూ బీసీ సమాజ ఐక్యత, అభివృద్ధి, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. తననియమాకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
