ప్రపంచ ధరిత్రి దినోత్సవం..

ప్రపంచ ధరిత్రి దినోత్సవం..
భూమాతను కాపాడండి.. పర్యావరణాన్ని రక్షించండి…
భూమాత క్షోభ ను బాదంపప్పు బద్ద పై 40 సూక్ష్మ చిత్రాలు…
చిత్రకారుడు కళా రత్న చింతలపల్లి కోటేష్….
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రపంచ దరిత్రి దినోత్సవం సందర్భంగా భూమాతను కాపాడండి పర్యావరణ రక్షించండి అంటూ చేతులు జోడిస్తూ నంద్యాలకు చెందిన చిత్రకారుడు కళారత్న చింతల పల్లె కోటేష్ బాదంపప్పు పై ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎర్త్ డే సందర్బంగా బాదంపప్పు బద్ద పై మైక్రో బ్రష్ లతో వాటర్ కలర్ పెయింటిగ్స్ ద్వారా నలబై సూక్ష్మ చిత్రాలను ఒక గంటలో వేసి మంచి సందేశాన్ని ఇచ్చారు.

ఈ చిత్రంలో భూమాత భూమిని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అంటూ చేతులు జోడిస్తూ వేదనతో వేడుకున్నట్లు, అలాగే వన్య ప్రాణులు చెట్లు లేక, ఆహారం లేక, నీటి కొరతతో అలమటించి పోయి భూమాతకు మొర పెట్టుకున్నట్లు, చిత్రంలో చూపించారు. ఎండి పోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల, జంతువుల కళే బరాలు వున్నట్లు, అలాగే నీటి బొట్టులో చెట్టు వున్నట్లు అంటే నీరును, చెట్లను కాపాడు కోవాలని అర్థం.
ఇలా చిన్న బాదం పప్పు పై ఇన్ని సూక్ష్మ చిత్రాలను వేసానని తెలిపారు. ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ సకల జీవరాశులకు భూమి నిలయం. కాని మానవులు తమ అవసరాల కోసం భూమికి హాని కలిగిస్తున్నారు. పర్యావరణంలో సమతుల్యం లేకనే భూమి అత్యంత వేడిమి వుంది. వాతావరణంలో మార్పు వచ్చింది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది.. భూమి మీద దృష్టి పెట్టకుంటే భవిష్యత్ లో మరెన్నో ప్రమాదాలు జరుగుతాయి. మనిషి మనుగడకు ముప్పు వాటిల్లుతుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు.
నీటిని వృధా చేయకూడదు, విపరీతంగా చెట్లను పెంచాలన్నారు. పర్యావరణం పచ్చగా వుంటేనే భూమిలోని వేడి తగ్గి చల్ల బరుస్తుంది. ప్రతి జీవరాశికి భూమిలో నివసించే హక్కు వుంది. భూమి రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. ప్రభుత్వం కూడా పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన కల్పించి భూమిని కాపాడుకోవాలని తెలియ చెప్పాలి. భూమి నుండి అన్ని అవసరాలు తీర్చుకొని మనం భూమిని కాపాడుకోలేక పోతున్నాం.
నేను వేసిన ఈ బాదం పప్పు కూడా భూమినుండి వచ్చిందే. భూమి అంటే మనకు కావాలిసినది ఇచ్చే అక్షయపాత్ర. మన భూమిని చేయకు – మరు భూమి. అందరూ పర్యావరణాన్ని కాపాడుకొని భూమిని రక్షించు కొందాం అనే సందేశాన్ని ఇచ్చినట్లు తెలిపారు.
