తెలంగాణ వైపు నార్వే చూపు..

తెలంగాణ వైపు నార్వే చూపు..

సచివాలయంలో కీలక భేటీ!

ఆంధ్రఫ్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ సచివాలయంలో నార్వే దేశ రాయబారి మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్ రంగాల్లో పరస్పర సహకార అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.

రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను, పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నార్వే ఇన్నోవేషన్ హెడ్ బ్యోర్న్ ఐవర్సన్, ఫస్ట్ సెక్రటరీ సిల్జే క్రిస్టీన్ ఆండర్సన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సిరి వెసెత్ మెలింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply