Maximize Profits – When Buying Gold – 2626 బంగారంలో కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

స్వల్పకాలంలో ధరల్లో హెచ్చు తగ్గులు సహజం.
ఎక్కువ కాలం ఎదురు చూడకుండా దశలవారీగా కొనుగోలు చేయడం మంచిది.
ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టకుండా కొద్దికొద్దిగా కొనాలి.
వచ్చే ఏడాదిలో బంగారం ధరలు 10%–20% వరకు పెరిగే అవకాశం
ప్రపంచ ఆర్థిక ఉద్రిక్తతలు తగ్గితే ధరలు 3%–7% వరకు తగ్గవచ్చు.
అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధరలు 5%–10% వరకు పెరగవచ్చు.

Maximize Profits – When Buying Gold-2626 : ఆంధ్ర‌ప్ర‌భ వెబ్, బిజెనెస్ : ప్ర‌పంచ దేశాల్లో బంగారానికి నిరంత‌రం డిమాండ్ ఉంటుంది. ప‌సిడిని సుర‌క్షిత ఆస్తిగా పెట్టుబడిదారులు భావిస్తారు. బంగారం ధ‌ర‌ల్లో హెచ్చు త‌గ్గులు స‌ర్వ‌సాధార‌ణం. భారీగా త‌గ్గిపోయే అవ‌కాశాలు ప్ర‌స్తుతం లేదు. అమెరికా డాల‌ర్‌పై కూడా ప‌సిడి రేట్ల ప్ర‌భావం ఉంటుంది. ప్ర‌స్తుతం ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త నేప‌థ్యంలో ప్ర‌పంచంలో అనిశ్చితి ఉంది. దీని ప్ర‌భావం కూడా బంగారం ధ‌ర‌ల‌పై ప‌డుతుంది. పెళ్లి, శుభ‌కార్యాల సంద‌ర్భంగా కొనుగోలు చేయాల‌నుకునే వారు ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా కొనుగోలు చేయ‌డం మంచిద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Maximize Profits – When Buying Gold-2626 ఉద్రిక్త‌త‌లు నేప‌థ్యంలో
అమెరికా, ఇరాన్ మ‌ధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు బంగారం ధరలు పెరగడం సహజం. కానీ యుద్ధం ఉంది కాబట్టి బంగారం క‌చ్చితంగా పెరుగుతుంద‌ని చెప్పడం క‌ష్టం. ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగితే బంగారం ధ‌ర‌లు కొంత వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశాలు ఉంటాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం నేప‌థ్యంలో ఆయిల్ రేట్లు పెరిగి ద్ర‌వ్యోల్బ‌ణంపై ప్ర‌భావం చూపుతుంది. అందుకే ప‌సిడి కొనుగోలు చేసేట‌ప్పుడు మార్కెట్ ప‌రిస్థితి కూడా ప‌రిశీలించాలి.

Also Read పాత బంగారంతోనే బెస్ట్

Maximize Profits – When Buying Gold-2626 స్వ‌ల్ప‌కాలంలో హెచ్చు త‌గ్గులు
బంగారం ధరలను క‌చ్చితంగా ఎవరూ చెప్పలేరు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితులు ఆధారంగా ఒక అంచనా వేసుకోవ‌చ్చు. ఒక నెల‌లో అంటే స్వ‌ల్పకాలం ప‌రిశీలిస్తే ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. యుద్ధ ఉద్రిక్తతలు పెరిగితే బంగారం కొత్త గరిష్ఠ స్థాయిలను తాకవచ్చు. ప్ర‌స్తుతం అమెరికా, ఇరాన్ మ‌ధ్య జ‌రుగుతున్న శాంతి చ‌ర్చ‌ల నేప‌థ్యంలో బంగారం ధ‌ర‌లు కాస్తా త‌గ్గుముఖ ప‌డుతున్నాయి. బంగారం ధ‌ర‌లు ఇంకా త‌గ్గే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌వేళ ఉద్రిక్త‌త‌లు పెరిగితే ఒక్క‌సారిగా పెరిగే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. ఒక‌వేళ బంగారం ధ‌ర‌లు తగ్గితే 3%–7% వరకు ఉంటుంద‌ని ప‌రిశీల‌కుల అంచ‌నా.

Maximize Profits – When Buying Gold-2626 మూడు నెల‌ల్లో ప‌రిశీలిస్తే…
కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తే ధరలకు మద్దతు ఉంటుంది. అమెరికా వడ్డీ రేట్లు తగ్గించే సంకేతాలు వ‌స్తున్నాయి. ఒక‌వేళ అమెరికాలో వ‌డ్డీ రేట్లు త‌గ్గితే బంగారం ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంది. ఒక వేళ పెర‌గినా ప్రస్తుత ధరల కంటే 5%–10% వరకు పెరిగే అవకాశం ఉంది.

Maximize Profits – When Buying Gold-2626 దీర్ఘ‌కాలం ప‌రిశీలిస్తే..
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కొనసాగితే బంగారం బలమైన ఆస్తిగా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాల పెట్టుబడిదారులకు బంగారం ఇప్పటికీ ఒక రక్షణాత్మక పెట్టుబడిగా పరిగణించబడుతోంది. ఒక సంవత్సరం తర్వాత ప్రస్తుతం ఉన్న ధరల కంటే 10%–20% వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇది క చ్చితం కాదు… కానీ ఒక అంచ‌నా మాత్ర‌మే.

Maximize Profits – When Buying Gold-2626 ఎక్కువ రోజులు ఎదురు చూడొద్దు
పెళ్లి, శుభ‌కార్యాల నిమిత్తం ఆభరణాల కొనుగోలు కోసం అయితే ఎక్కువ రోజులు ఎదురు చూడకపోవడం మంచిది. పెట్టుబడి కోసం అయితే ఒకేసారి మొత్తం కొనకుండా, కొంత కొంతగా కొనడం మంచిది. ఎందుకంటే బులియ‌న్ మార్కెట్ రోజురోజుకూ మారుతుంది.

గమనిక: బంగారం సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతున్నప్పటికీ, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Also Read క‌ల‌ర్ కూడా ఆక‌ర్ష‌ణ‌కు అడ్డురాదు