old gold exchange I పాత బంగారంతో అభరణాలు బెస్ట్

- కొత్త గోల్డ్ కొనుగోలుకు దూరం
- రూపాయి స్థిరత్వం లక్ష్యం
- దిగుమతి ట్యాక్స్ పెంచిన కేంద్రం
- బంగారు వర్తకులు ప్రత్యామ్నాయం
- పాత బంగారంతో అభరణాలు బెస్ట్
- మధ్యతరగతికి గడ్డు కాలం
- బంగారం లోకంపైనే ఇన్వెస్టర్ల దృష్టి
- అలాంటి మదుపరులకు బ్రేక్
- బ్యాంకులో వడ్డీ రేటు అంతంతే
ఆంధ్రప్రభ వెబ్ (జాతీయం) : పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు ప్రారంభమైన తర్వాత ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. దీని ప్రభావం రూపాయిపై కూడా పడటంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఏర్పడింది. రూపాయి విలువలో అధిక హెచ్చుతగ్గులు రాకుండా నియంత్రించేందుకు ప్రధాని మంత్రి మోదీ బంగారం కొనుగోలు ఏడాది పాటు నిలుపు చేయాలని ప్రజలను కోరారు. దీనిపై దేశం మొత్తం మీద చర్చ సాగుతున్నది.
ఇది ఒకింత బంగారం వ్యాపారులకు నష్టం కలిగించిన అంశమే. కానీ జాతీయ ఆర్థిక భద్రత దృష్ట్యా వ్యతిరేకించే పరిస్థితి లేదు. రేపటి పెట్టుబడులకు పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ బ్యాంకులో పొదుపులపై ఆశించిన మేరకు వడ్డీ లేకపోవడం.. భూములు కొనుగోలు పరిస్థితి లేకపోవడం.. పైగా చేతిలో ఎంత డబ్బులు ఉంటే అంతే బంగారంపై మదుపు పెట్టడం చేస్తున్నారు.
ప్రధాని పిలుపుతో పేద, మధ్య తరగతి ప్రజలు కంగుతిన్నారనడంలో సందేహం లేదు. బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పిన ప్రధాని మంత్రి బ్యాంకులు, పోస్టాఫీసులో పొదుపు చేసే నగదుపై వడ్డీ రేటు పెంచితే అటు వైపు మొగ్గు చూపుతారు. అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తే బాగుంటుందని పేదలు కోరుకుంటున్నారు. లేకుంటే పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతాడన్న సందేహం లేకపోలేదు.

old gold exchange రూపాయి విలువ పతనం…
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లారుతాయో తెలియని పరిస్థితి. దీంతో చమురు ధరలు అమాంతంగా పెరిగాయి. అంతేకాదు సరఫరా గొలుసు అవరోధాలు ఏర్పడతాయన్న ఆందోళనలూ ఉన్నాయి. దీంతో వర్ధమాన దేశాల కరెన్సీలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా వార్ సందర్భంగా రూపాయి విలువ కూడా ఇటీవల భారీగా పతనమైంది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ ప్రకారం ఒక అమెరికా డాలర్ (యూఎస్‌డీ)తో పోలిస్తే రూ.95.93 ఉంది, ఒక యూరో తో అయితే రూ.111.63, ఒక బ్రిటిష్ పౌండ్ విలువ రూ.128.09, ఒక ఆస్ట్రేలియన్ డాలర్ విలువ రూ. 68.41 ఉంది.
old gold exchange రూపాయి విలువ తగ్గితే… ధరలు పెరుగుతాయి…
రూపాయి విలువ తగ్గితే తద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. అలాగే మన ఖజానాలోని విదేశీ మారకపు నిల్వలు బయటకు వెళ్తాయి.. ఇలా వెళ్లడం వల్ల ధరలు అదుపు చేయడంపై ప్రభుత్వాలు నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది.
భారతదేశం తన అవసరాలకు కావాల్సిన 85 శాతం ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. బంగారం కూడా భారీగా దిగుమతి అవుతోంది. ఏటా 700-800 టన్నుల బంగారం వినియోగిస్తుంటే అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది పరిమితమే. అంటే 90 శాతానికి పైగా బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం, ముడి చమురుకు అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాలి. అంటే మనం ఎంత ఎక్కువగా ఈ రెండూ దిగుమతి చేసుకుంటే ఆమేర మన ఖజానాలోని విదేశీ మారకపు నిల్వలు బయటకు వెళ్తాయి.
దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ కు డిమాండ్ పెరిగి, భారత రూపాయి విలువ పడిపోతుంది. సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తికి, పసిడికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు. అదే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడితే దాని ప్రభావం వస్తూత్పత్తి మీద పడుతుంది. ఒకవేళ కొనుగోళ్లను నిరుత్సాహపరిచేందుకు ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పైగా రూపాయి విలువ తగ్గితే, దిగుమతి చేసుకునే వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. దీనివల్ల సామాన్యుల పైనా భారం పడుతుంది.

old gold exchange రూపాయి విలువ స్థిరత్వంలో బంగారం కీలకం
రూపాయి విలువ స్థిరత్వం కోసం బంగారం దిగుమతి కీలకంగా మారింది. ప్రతి ఏటా 700-800 టన్నుల బంగారం కొనుగోలు చేస్తున్నారు. అందుకే ప్రధాని మంత్రి మోదీ బంగారం కొనుగోలు ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని తెలంగాణ గడ్డ మీద నుంచి పిలుపునిచ్చారు. బంగారం కొనుగోళ్లు తగ్గితే రూపాయి స్థిరంగా ఉంటుంది. కాబట్టి దిగుమతుల బిల్లు తగ్గించుకోవడం కోసం బంగారం కొనుగోళ్లను వాయిదా వేయడమే ప్రత్యామ్నాయ మార్గమని ప్రధాని సూచించారు.
బంగారం దిగుమతులపై ప్రభుత్వం ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. దిగుమతులు అసాధారణంగా పెరిగిన సందర్భాల్లో నియంత్రించేందుకు గత ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టేవి. బంగారంపై విధించే సుంకాలను భారీగా పెంచడం, దిగుమతులపై ఆంక్షలు, సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి ప్రత్యామ్నాయ పథకాలను తీసుకురావడం వంటివి చేశాయి.
old gold exchange బంగారంపై సుంకం పెంపు
బంగారు దిగుమతి సుంకాలు పెంపు, గోల్డ్, బంగారం, బంగారం ధరలు, గోల్డ్ జువెలరీ, గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు మీ వంతు సాయంగా ఏడాది పాటు కొత్త బంగారం కొనుగోళ్లు ఆపండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఒక వైపు పిలుపునిస్తూ మరో వైపు దిగుమతి సుంకాలు పెంచారు.
కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచడంతో మార్కెట్లో ధరలు భగ్గుమంటున్నాయి. ఈ పరిణామం ఆభరణాల సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని పలువురు వర్తకులు విశ్లేషించారు. కస్టమర్లు తమ పాత బంగారాన్ని ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకోవడం ద్వారా పెరుగుతున్న రేట్ల భారం నుంచి సులభంగా బయటపడవచ్చని వారు సూచించారు.

old gold exchange బంగారంపై మోజు ఎందుకంటే…
బంగారం ఒకప్పుడు ధనవంతులు మాత్రమే కొనుగోలు చేసే వారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకనుగుణంగా పేదవాడు సైతం బంగారం కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్తు పెట్టుబడులకు బంగారం కొనుగోలు చేయడమే ఏకైక మార్గంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల్లో, పోస్టాఫీసులో డబ్బులు దాచుకున్న ఆశించిన మేరకు వడ్డీ రావడం లేదు. కేవలం 6.5 శాతానికి అటూ, ఇటూ ఉంటుంది. ఒక లక్ష రూపాయలు డిపాజిట్ వేస్తే సంవత్సరానికి కేవలం ఏడు వేల రూపాయల లోపు వడ్డీ వస్తుంది.
అదే బంగారం కొనుగోలు చేసుకుని ఉంచుకుంటే కనీసం పది వేలు వస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరలు ప్రకారం భూములు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీనికితోడు బంగారం వర్తకులు కూడా కొన్ని స్కీమ్‌లు ఏర్పాటు చేసి పేదలను ఆకర్షించుకుంటున్నారు. జాతీయ బ్యాంకులో చిన్న మొత్తల పొదుపు కంటే బంగారం స్కీమ్‌లో చేరితే అధిక లాభాలు పొందుతున్నారు. పైగా స్కీమ్‌లు కాల పరిమితి కూడా తక్కువగా ఉండడంతో పేదలు, మధ్య తరగతి, ధనవంతులు కూడా వాటిపై ఆకర్షిస్తున్నారు. ఇలా బంగారం కొనుగోలుదారుల సంఖ్య పెరిగింది. ఒక వేళ చిన్నమొత్తాల పొదుపులు, బ్యాంకు వడ్డీలు పెంచితే అటువైపు ప్రజలు మళ్లీ.. బంగారం కొనుగోలు తగ్గిస్తారు.

పేద, మధ్య తరగతి ప్రజలు శుభకార్యాలతోపాటు తమ వద్ద ఉన్న మిగులు డబ్బులతోనే బంగారం కొనుగోలు చేస్తున్నారు. బంగారం ధరలు పెంచినా అవసరం నిమిత్తం, అలాగే బంగారం విలువ అలానే పెరుగుతుందని భావనతో కొనుగోలు చేస్తుంటారు. అటు బ్యాంకుల్లో డబ్బలు ఉంచిన సరైన వడ్డీ రాక, బంగారం రేటు పెరిగిపోతుంటే రేపటి పెట్టుబడుల కోసం నేడు పొదుపు చేసే అవకాశం కోల్పోతారు. అప్పుడు పేదవాడు పేదవాడిగా మిగిలిపోతాడు.

