Collector| ప్రతి దశ అత్యంత కీలకం
Collector| నర్సంపేట, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి దేశ అత్యంత కీలకమని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద(Collector Satya Sarada) అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల(Third phase of nominations) ప్రక్రియ బుధవారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం రాత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… మూడవ విడతలో నర్సంపేట రెవెన్యూ డివిజన్(Revenue Division) లోని ఖానాపూర్, చెన్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డ్ సభ్యులకు నామినేషన్(Nomination for ward members) స్వీకరణ జరగనున్న దృష్ట్యా నామినేషన్‌ల స్వీకరణలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎటువంటి లోపాలు లేకుండా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా విధులు(duties) నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఎన్నికల నిర్వహణలో ప్రతి దశ అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొంటూ, నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు(Necessary arrangements) ముందుగానే పూర్తి చేయాలన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నామినేషన్‌ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్(Polling) వంటి ప్రతి కార్యక్రమం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఖచ్చితంగా అమలు చేయాలని(to be implemented) కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, జిల్లా ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ అధికారి బాలకృష్ణ, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, ఎంపీడీవోలు, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
