Masoud Pezashkian | ఇరాన్ మూడు షరతులు

Masoud Pezashkian | ఇరాన్ మూడు షరతులు

Masoud Pezashkian | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గత కొన్నిరోజులుగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. అయితే యుద్ధం ముగించాలంటే ఇరాన్ మూడు కీలక షరతులు విధించింది. అందులో మొదటిది… ఇరాన్ హక్కులను అంతర్జాతీయంగా గుర్తించాలని, రెండోది… ఇప్పటివరకు జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని, మూడోది… భవిష్యత్తులో తమపై ఎలాంటి దౌర్జన్యాలు చేయబోమని హామీ ఇవ్వాలని పేర్కొంది.

ఈ విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియాన్‌ తన సోషల్ మీడియా వేదిక Xలో చేసిన పోస్టులో వెల్లడించారు. యుద్ధ పరిస్థితులు ముగియాలంటే ఈ షరతులను పరిగణలోకి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply