Rajendra Prasad | క్షమాపణ చెప్పాల్సిందే…
Rajendra Prasad | క్షమాపణ చెప్పాల్సిందే…
- కాంతారావును పొగిడేందుకు..
- ఎంజీఆర్ ను కించపరుస్తారా..?
Rajendra Prasad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై కోలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కత్తి కాంతారావు జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ కాంతారావు గొప్పతనాన్ని కొనియాడే క్రమంలో తమిళ చిత్ర పరిశ్రమ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ (MGR) పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
కాంతారావు పేరు చెబితేనే ఎంజీఆర్ భయపడేవారని, ఆ సమయంలో ఆయన ప్రవర్తనను ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ వాడిన పదజాలం వివాదాస్పదంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి గౌరవనీయమైన సీనియర్ నటుడు, కోట్లాది మంది ఆరాధ్య దైవమైన ఎంజీఆర్ ను అంత తక్కువ చేసి మాట్లాడటం తనను షాక్‌కు గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక మహానుభావుడిని పొగిడేందుకు మరొక మహానుభావుడిని కించపరచడం సరైన పద్ధతి కాదని విశాల్ హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు తమిళ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని, దీనిపై రాజేంద్ర ప్రసాద్ వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
