ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ఆరోగ్యకర భవిష్యత్తు…!

ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ఆరోగ్యకర భవిష్యత్తు…!
పల్నాడు జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ.
నరసరావుపేట, ఆంధ్రప్రభ : ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ఆరోగ్యకర భవిష్యత్తు అని పల్నాడు జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ అన్నారు. ఈ నెల థీమ్ ‘ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్’ తో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. శనివారం నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం నుండి రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వరకు ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ అవగాహన ర్యాలీ ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు.

నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన, ఆర్డీవో మురళి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వారు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో మొక్కలు నాటారు.
