MajorAccident | సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

MajorAccident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : పెద్దఅంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వస్తున్న ఎయిర్‌ఇండియా ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

బస్సు పెద్దఅంబర్‌పేట్ సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా పొగలు రావడంతో పాటు మంటలు వ్యాపించినట్లు సమాచారం. ఘటనను గమనించిన డ్రైవర్, సిబ్బంది వెంటనే అప్రమత్తమై బస్సును ఆపి అందరినీ కిందికి దింపారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.