KTR | బీఆర్ఎస్ కార్పొరేట‌ర్‌ల‌ను అరెస్టు చేయ‌డం దుర్మార్గం..

హైద‌రాబాద్ : జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్‌లను అరెస్టు చేయడం దుర్మార్గమని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా ? అని నిల‌దీశారు. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా.. మరోసారి అవే కాగితాలపైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా? అని రేవంత్ స‌ర్కార్‌ను కేటీఆర్ ప్ర‌శ్నించారు.

పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజావసరాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్థ‌ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply