గ్రామాల మధ్య రహదారి ఆక్రమణ…

గ్రామాల మధ్య రహదారి ఆక్రమణ…
రైతుల చర్యలతో ప్రజలకు ఇబ్బందులు.
గట్టుప్పల, ఆంధ్రప్రభ : అంతంపేట హరిజన తండా రెండు గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారి విషయంలో వివాదం నెలకొంది. స్థానిక రైతులు భూమి తమదేనని పేర్కొంటూ, ఇప్పటి వరకు ప్రజలు వినియోగిస్తున్న రహదారిని ఆక్రమణ చేసిన ఘటన. ఈ భూమి పూర్తిగా మా సొంతం, అందువల్ల మా భూమిలో నుంచే రహదారి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నా.
ప్రస్తుతం ఉన్న మార్గం ద్వారా కాకుండా వేరే దిక్కు నుండి నూతన రహదారిని ఏర్పాటు చేయడంతో నూతన రహదారి చాలా మూలమలుపులు ఉండడంతో, ఆ మార్గంలో ప్రయాణించడం కష్టసాధ్యమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు,అత్యవసర సేవలు, విద్యార్థుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. అధికారులు,ప్రజా ప్రతినిధులు కల్పించుకుని పాత మార్గంలోనే రోడ్డును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
