Telangana | ప్రజాపాలన కోసమే కాంగ్రెస్‌కు మద్దతు
Telangana | ప్రజాపాలన కోసమే కాంగ్రెస్‌కు మద్దతు
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ జన సమితి (టీజేఎస్) 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి టీజేఎస్ అధినేత, ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ దిశ, రాజకీయ వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
నిరంకుశ పాలన అంతమై ప్రజాపాలన రావాలని తాము కోరుకున్నామని కోదండరాం తెలిపారు. ఆ లక్ష్యంతోనే రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.
తెలంగాణలో టీజేఎస్ లేని ప్రజా పోరాటాలు లేవని ఆయన పేర్కొన్నారు. మంత్రులం కావాలని, ఎమ్మెల్యేలం కావాలని తమకు ఆశలేదని, ప్రజలకు అవసరమైనప్పుడు ఎప్పుడూ తోడుగా నిలిచామని అన్నారు.
ప్రజలు కేంద్రంగా ఉండేలా రాజకీయాలు చేశామని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని కోదండరాం వివరించారు. మే 12న జరిగే పార్టీ ప్లీనరీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.
