36230 crore | గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన ప్రధాని మోడీ

36230 crore | గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన ప్రధాని మోడీ
36230 crore |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైంది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టుగా నిలిచిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. రూ.36,230 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర రవాణా వ్యవస్థకు కొత్త ఊపునివ్వనుంది.
594 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన గంగా ఎక్స్‌ప్రెస్‌వే 12 జిల్లాల గుండా సాగుతోంది. ఆరు వరుసలతో రూపొందించిన ఈ రహదారి భవిష్యత్తులో మరింత విస్తరణకు కూడా అనుకూలంగా ఉండేలా నిర్మించారు.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు ప్రయాణ సమయం సగానికి తగ్గనుంది. దీంతో ప్రజలకు సమయం, ఇంధన వ్యయం ఆదా కావడంతో పాటు వాణిజ్య రవాణా కూడా వేగవంతం కానుంది.
ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారానే రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్ ఆర్థిక ప్రగతికి కీలకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
