తాళ్ల విజయ్‌కుమార్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన మహేష్‌కుమార్ గౌడ్
కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన టీపీసీసీ అధ్యక్షుడు
ఎడపల్లి, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాళ్ల విజయ్‌కుమార్ గౌడ్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, గీత కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశ వేణు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేటర్లు ప్రవీణ్‌కుమార్ గౌడ్, దయాకర్ గౌడ్, ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్‌రావు, జానకంపేట సర్పంచ్ సుంచన కోట అనురాధ–రాధాకిషన్ గౌడ్, ఎడపల్లి మండల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
