చిరు సహాయం.. సొంత నిధులతో ఫించన్
పాయకాపురం, ఆంధ్రప్రభ: ఏదైనా సాంకేతిక లోపం వలన ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా ద్వారా అందించే ఫించన్ అందకపోవడంతో, వారికి చిరు సహాయంగా సొంత నిధులతో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఫించన్ అందజేస్తున్నారని టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ అన్నారు. సింగ్ నగర్ ప్రాంతంలో సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో నిరుపేద వృద్ధురాలికి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన సొంత నిధులతో నాలుగువేల రూపాయల వృద్ధాప్య పింఛన్ టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ అందజేశారు.
ప్రభుత్వం ప్రతినెల అందించే పింఛన్లతో పాటు ఎవరికైనా పింఛన్ దరఖాస్తు చేసుకునే క్రమంలో సాంకేతిక లోపం జరిగితే అటువంటి వారికి ముందస్తుగా ఎమ్మెల్యేసొంత నిధులతో పింఛన్ అందజేయడం జరుగుతున్నదని సిద్ధార్థ అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్చార్జి ప్రియా సోమేశ్వరావు, పైడి శ్రీను, కే.దుర్గారావు ల్,దొండపాటి సుల్తానా,సుర్విపల్లి అమర్నాథ్ గౌడ్,పాల విజయ తదితరులు పాల్గొన్నారు.
