ఆపదలో అండగా ఎమ్మెల్యే వేముల పరామర్శ

ఆపదలో అండగా ఎమ్మెల్యే వేముల పరామర్శ

బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు. భీమ్‌గల్ ఈనాడు రిపోర్టర్ శ్రీనివాస్ తల్లి ఇటీవల మృతి చెందడంతో జాగీర్యాల్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్ అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

భీమ్‌గల్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు అరుణ్ నానమ్మ ఇటీవల మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాచన్‌పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల గంగాధర్ తల్లి మృతి చెందడంతో వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. దేవక్కపేట్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు గంగరాజాం తండ్రి మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామంలో లౌక్య తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.

బాబానగర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు దశగౌడ్ సోదరుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెంట మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ చౌటుపల్లి రవి, ఎంపీపీ ఆర్మూర్ మహేష్, సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Leave a Reply