మహేంద్రనాథ్ ఆశయాలు నేటి తరానికి ఆదర్శం..

అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రముఖ సంఘసంస్కర్త, మాజీ మంత్రివర్యులు, దివంగత నేత పుట్టపాగ మహేంద్రనాథ్ 100వ జయంతి వేడుకలు అచ్చంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మహేంద్రనాథ్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహేంద్రనాథ్ గారు సామాజిక న్యాయం, ప్రజాసేవ, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మహానేత అని కొనియాడారు.

సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, విలువలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. మహేంద్రనాథ్ గారి సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన బాటలో నడవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహేంద్రనాథ్ గారికి ఘన నివాళులు అర్పించారు.