బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎమ్మెల్యే కృషి
మోత్కూర్, ఆంధ్రప్రభ: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య ఆర్థిక సహకారం అందించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎమ్మెల్యే మందుల సామేలు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించగా, ప్రజలు 52 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు డా. గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగోని రామచంద్ర గౌడ్, పురుగుల నరసింహ, బద్దం నాగార్జున రెడ్డి, పల్లపు సమ్మయ్య, అన్నేపు పద్మ, మురళితో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
