మధుది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ఆంధ్రప్రభ : కాంగ్రెస్ గుండాల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు మృతదేహానికి మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి శనివారం జనరల్ ఆసుపత్రిలో నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు.కాంగ్రెస్ గుండాల హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ్మన్నారు. ఈ హత్యలో పోలీసుల భాగస్వామ్యం ఉందనే అనుమానం ఉందన్నారు.హత్య రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదన్నారు.పూర్వం కక్షలకు నిలయంగా నల్లగొండ జిల్లా, కాంగ్రెస్ లోనే అంతర్గత విభేదాలు తోటి వందలాది హత్యలు చేసుకోవడమే కాక ఆనాడు ఎన్నికలోస్తే ఎన్ని హత్యలు జరుగుతాయన్న దారుణమైన పరిస్థితి ఉండేనన్నారు. కెసిఆర్ నాయకత్వంలో శాంతిభద్రతలను పూర్తిగా అదుపులో ఉంచిమన్నారు. పోలీసులను కూడా పూర్తిగా స్వేచ్ఛాయిత వాతావరణంలో పని చేసుకునే వీలు కల్పించామన్నారు.కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చి రెండున్నరేళ్లుగా ఎన్నో అరాచకాలు చూస్తున్నామని,కాంగ్రెస్ గుండాలు, రౌడీల చేతుల్లోనే పోలీస్ స్టేషన్ నడుస్తున్నాయని ఆరోపించారు. సూర్యాపేటలోనూ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని,బీఆర్ఎస్ పార్టీ నాయకులను స్టేషన్లకు పిలిపించి మరీ కాంగ్రెస్ గుండాల ముందు నిలబెట్టి అవమాన పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనేక సందర్భాలలో పోలీసు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.

గతంలోనూ ఇదే కాంగ్రెస్ గుండాలు బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న ను దారుణంగా హత్య చేశారని, పార్టీ శ్రేణులకు సంయమనం పాటించాలని చెప్పమన్నారు.ఆ సాక్షులను భయపెట్టే ప్రయత్నం చేయడమే కాకుండా సడన్ గా పీపీ ని మార్చడం దుర్మార్గమైన చర్య అన్నారు. కేసును బలహీనం చేయడం కోసమే పీపీ ని మార్చారని ఆరోపించారు. మధు హత్యకు కాంగ్రెస్ నాయకులు, పోలీసు అధికారులే బాద్యులన్నారు.
కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో.. రిమాండ్ రిపోర్ట్ లో ఏం చూపిస్తారో చూస్తామన్నారు. పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే తర్వాతైనా కేసుల్ని తిరగతోడుతామని హెచ్చరించారు. విచారణలో తప్పుచేస్తే ఐజీ స్థాయి అధికారులను కూడా పదేళ్ల తర్వాత జైళ్లకు పంపిన ఘటనలు ఎన్నో చూశామన్నారు. నిజమైన నిందితులెవరో వారిని గుర్తించి సరైన శిక్ష పడే విధంగా పోలీసు అధికారులు పనిచేయాలని, తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నించిన ఏ అధికారినైనా వదిలిపెట్టమన్నారు. మధు కుటుంబానికి అండగా నిలబడతామని, ఇద్దరు ఆడపిల్లలకు చదువుల బాధ్యత, కుటుంబ పోషణ విషయంలో బిఆర్ఎస్ పార్టీగా బాధ్యత తీసుకుంటామన్నారు. ఒంటెద్దు వెంకన్న కుటుంబానికి ఏ విధంగా అండగా నిలిచామో మధు కుటుంబానికి కూడా అదేవిదంగా అండగా నిలబడతామన్నారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
