Maha Shiva Puja | ద్వాదశ జ్యోతిర్లింగాల మహా శివపూజ….

Maha Shiva Puja | ద్వాదశ జ్యోతిర్లింగాల మహా శివపూజ….

  • వైభవంగాకొనసాగినకలశ ఊరేగింపు
  • ఆకట్టుకున్నపురంతులఖడ్గ ప్రదర్శన
  • శివనామస్మరణతో పులకించిన ఊట్కూర్

Maha Shiva Puja | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని దేవినగర్ వీధిలో వెలసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు ద్వాదశ జ్యోతిర్లింగాల మహా పూజ అధ్యంతం అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ కొనసాగింది. గురు స్వాములు శ్రీ నేరేడుగం సిద్ధిరామయ్య, వడ్డేమాన్ ప్రభు లింగం ఆధ్వర్యంలో 12 జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసి వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించి శివుడి విగ్రహానికి అభిషేకాలు బిల్వార్చన మహా మంగళహారతి తదితర పూజలు ఘనంగా నిర్వహించారు.

ఉదయం గ్రామ పురవీధుల గుండా నిర్వహించిన కలశం ఊరేగింపు వైభవంగా కొనసాగింది. ప్రధాన చౌరస్తాల వద్ద పురంతులఖడ్గ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకోగా పలువురు శివ స్వాములు భక్తులు పెదవులు నాలుక కనురెప్పలకు ఇనుప చువ్వా గుచ్చుకొని తమ భక్తిని చాటారు. కలశం ఊరేగింపు పురస్కరించుకొని దారి పొడవునా భక్తులు నిండుకుండలతో రోడ్లు శుభ్రంచేసితమభక్తినిచాటారు.

అనంతరం వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో కొనసాగిన ద్వాదశ జ్యోతిర్లింగాల మహా శివపూజలో శివుడి విగ్రహానికి అభిషేకాలుమహా మంగళ హారతి, బిల్వార్చన నిర్వహించారు. నాలుగు గంటల పాటు కొనసాగిన మహా పూజోత్సవం కన్నుల పండుగగా కొనసాగగా గురుస్వాములు భీమ్ రెడ్డి, అనంతరెడ్డి, దేవేంద్రప్ప ఆధ్వర్యంలో పాడిన భక్తి గీతాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. శివనామస్మరణతో ఊట్కూర్ మండల కేంద్రం మార్మోగింది. మహా పూజ పురస్కరించుకొని భక్తులకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు.