మధిర టౌన్ ప్లానింగ్ అధికారి బదిలీ..

మధిర టౌన్, ఆంధ్రప్రభ : మధిర మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసరావును బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండు సంవత్సరాలుగా మధిర మున్సిపాలిటీలో శ్రీనివాసరావు టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జరిగిన బదిలీల్లో భాగంగా శ్రీనివాసరావుని ఇల్లందు మున్సిపాలిటీకి బదిలీ చేశారు.