Gun Fire | మాజీ ఎమ్మెల్యే, ఎంపీకి పాజిటివ్

Gun Fire | మాజీ ఎమ్మెల్యే, ఎంపీకి పాజిటివ్

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో నిన్నరాత్రి కాల్పులు కలకలం
11మంది అరెస్ట్, కొకైన్, రివ్వాలర్ స్వాధీనం
మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఏపీ ఎంపీ పుట్టా మహేశ్‌ కు డ్రగ్స్ పాజిటివ్
మెుయినాబాద్ డ్రగ్స్ కేసుపై కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలి
అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలందరం పరీక్షలు చేసుకుందాం
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారు
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్

Gun Fire | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో నిన్నరాత్రి కాల్పులు కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఈగల్ టీమ్ఆకస్మిక దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఏపీ ఎంపీ పుట్టా మహేశ్‌ సహ 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మెుయినాబాద్ డ్రగ్స్ కేసులో ఆరుగురికి పాజిటివ్ వచ్చిదని ఈగల్ బృందం ఎస్పీ గిరిధర్ తెలిపారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఏపీ ఎంపీ పుట్టా మహేశ్‌, రితేష్‌రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డికి పాజిటివ్ తెలిదని ఎస్పీ గిరిధర్ వెల్లడించారు.

Gun Fire

కాగా రాత్రి నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో ఎంపీ పుట్టా మహేశ్‌కు నెగెటివ్ వచ్చిదని ఎస్పీ గిరిధర్ వివరించారు. పోలీసులు రైడ్ చేసిన సమయంలో నమిత్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారు. పోలీసుల రాకను గమానించిన రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్ రోహిత్ రెడ్డి ఫోన్లను ధ్వంసం చేశారు. దీంతో శ్రవణ్ ను పోలీసులు విచారిస్తున్నారు.

మెుయినాబాద్ డ్రగ్స్ కేసుపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్ స్పందించారు. డ్రగ్స్ కేసుపై కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలన్నారు. ఈగల్ బృందం కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది.. ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలందరం పరీక్షలు చేసుకుందామని పీసీసీ చీఫ్ తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని పీసీసీ చీఫ్ వెల్లడించారు.

Gun Fire

బీఆర్‌ఎస్‌ హయాంలో డ్రగ్స్ తెలంగాణగా ఉండేదని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఈగల్ బృందాన్ని సీఎం ఏర్పాటు చేశారు. చాలా డ్రగ్స్‌ కేసుల్లో రోహిత్‌రెడ్డి ప్రధాన వ్యక్తిగా ఉన్నారని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దుయ్యబట్టారు. రోహిత్‌రెడ్డి వంటి వ్యక్తులను బీఆర్‌ఎస్‌ పెంచిపోషిస్తోందన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వం కష్టపడుతుంటే.. బీఆర్‌ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

Leave a Reply