NARA LOKESH | జగన్‌ ‘సినిమా’ 11 రోజులు కూడా ఆడదు

NARA LOKESH | జగన్‌ ‘సినిమా’ 11 రోజులు కూడా ఆడదు

NARA LOKESH | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమరావతి అంశంపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ సభ్యుల గైర్హాజరుపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.

అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడాన్ని మంత్రి నారా లోకేశ్ తప్పుబట్టారు. ఈ నిర్ణయం ద్వారా ఆ పార్టీ ప్రజాప్రతినిధుల నిబద్ధత ఏంటో స్పష్టమవుతోందని ఆయన విమర్శించారు.

జగన్ వ్యాఖ్యలపై స్పందించిన లోకేశ్, పాదయాత్ర ద్వారా రాజకీయ సవాళ్లు విసురుతానన్న వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. ప్రజలు ఇప్పటికే జగన్‌కు తగిన సమాధానం ఇచ్చారని, కొత్తగా చూపిస్తానన్న “సినిమా” ఎక్కువకాలం నిలవదని వ్యాఖ్యానించారు. జగన్‌ సినిమా 11 రోజులు కూడా ఆడదన్నారు. అమరావతి తీర్మానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వాగతిస్తున్నారని, దీనికి విస్తృత మద్దతు లభిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.