Collector | రోడ్లు ఇలా ఉంటే ఎలా?

Collector | రోడ్లు ఇలా ఉంటే ఎలా?

కలెక్టర్ మేడం ఈ రహదారి మరమ్మత్తు చేయించండి

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నాగిరెడ్డి పల్లి పెద్దవాగు నుండి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా చేసేందుకు నారాయణపేట జిల్లా కలెక్టర్ (District Collector) ఇసుక రీచ్ కు అనుమతి ఇచ్చారు. నాగిరెడ్డి పల్లి వాగు నుండి నారాయణపేట, ఊట్కూర్, ధన్వాడ తదితర మండలాలకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా చేస్తున్నారు. బురదమయంగా మారి గుంతలు ఉండడంతో లబ్ధిదారులకు సకాలంలో ఇసుక సరఫరా చేయలేకపోతున్నామని ట్రాక్టర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా ఇసుక సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఇసుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బురదలో కూరుకు పోవడంతో తాము పడరాని పాట్లు పడుతున్నామని ట్రాక్టర్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి మరమ్మతు పనులు చేయించాలని పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇసుక సరఫరాకు నాగిరెడ్డిపల్లి ఇసుక రీచ్ కు అనుమతి ఇవ్వగా రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో సకాలంలో ఇసుక సరఫరా చేయలేక పోతున్నామని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రహదారి మరమ్మతు పనులు చేయించాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply