నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు : వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్..
భవిష్యత్తు అంతా బాలలదే అని నేటి బాలలే దేశ పౌరులు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని వయోజన విద్య అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం 58 వ గ్రంథాలయ వారోత్సవ కార్యక్రమాలను ఆర్.ఇ.శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.బాలల దినోత్సవ సందర్భంగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నంద్యాల జిల్లా కానాల వాసి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన అష్టదిగ్గజ కవి సూరన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించరు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నెహ్రూ బాలల విద్యకు బలమైన పునాదులు వేశారన్నారు.గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేద్దాం అని, గ్రంథాలయ సంస్థ అధికారులకు ఉద్యోగులకు పాఠకులకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవముల శుభాకాంక్షలు తెలుపుతూ, విద్యార్థి దశ నుంచే మేధోసంపత్తి ఏర్పర్చుకోని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తదుపరి విద్యార్థులతో గ్రంథాలయ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు టి.ఓంకారప్ప, డి. నరేంద్రనాథ్ శర్మ, శ్రీనివాసులు, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, బాషా పాల్గొన్నారు.

