CBN Call : గట్టు గొడవలొద్దు Andhra prabha RT News

CBN Call : గట్టు గొడవలొద్దు Andhra prabha RT News
తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా ఉందాం
నీటి వృథాను అరికడదాం
3వ ప్రపంప తెలుగు మహాసభలో సీఎం చంద్రబాబు
( గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో )
తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదు. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి… అన్ని మాట్లాడ్డం లేదు.. ఐక్యత గురించే మాట్లాడతాను. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్-1గా ఉండాలి… దీనికి నేను కట్టుబడి ఉన్నాను. తెలుగు జాతి నెంబర్-1గా ఉండాలంటే… మనలో ఐకమత్యంగా ఉండాలి. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలున్నా… తెలుగే మాతృభాష. రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గొడవలొద్దు (CBN Call) తెలుగు ప్రజాలకు పిలుపు ఇచ్చారు.

గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలో (World Telugu conference ఆయన మాట్లాడుతూ, పిల్లలకు తెలుగు భాష పట్ల మమకారం పెంచేలా చేయాలి… తెలుగు భాష ఎక్కడికీ పోదు… శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే భాషను కాపాడాలి. ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజన తర్వాత కూడా ఏపీలో ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించే భాగ్యం కలిగింది తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఉన్న ప్రజలందరి అభివృద్ధే నాకు ముఖ్యం. 30 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయంతో ఐటీలో తెలుగువాళ్లు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తెలుగు బిడ్డ పీవీ నర్సింహారావు అయితే.. ఐటీని అందిపుచ్చుకుని మన యువతకు, తెలుగు రాష్ట్రాలకు సంపద సృష్టించాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక తెలుగు రాష్ర్టాల మధ్య సఖ్యతపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
CBN Call : తెలుగు జాతి అభివృద్ధే లక్ష్యం

ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్-1గా ఉండాలి… దీనికి నేను కట్టుబడి ఉన్నాను. తెలుగు జాతి నెంబర్-1గా ఉండాలంటే… మనలో ఐకమత్యంగా ఉండాలి. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలున్నా… తెలుగే మాతృభాష. రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎన్టీఆర్ సీఎం అయ్యాకే… సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్ఎల్బీసీ, ఎస్ఎర్బీసీ ప్రాజెక్టులు తెచ్చారు. కల్వకుర్తి లిఫ్ట్, ఎఎమ్మార్ ఎత్తిపోతల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను నేను పూర్తి చేశాను. కృష్ణా డెల్టా మోడ్రనైజేషన్ పేరుతో నీటిని పొదుపు చేసి… ఆ నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. గోదావరి నదిపై గుత్ప, అలీసాగర్, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టాం. ఆంధ్ర ప్రాంతంలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి వంటి లిఫ్ట్ ప్రాజెక్టులు తెచ్చాం. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరిచ్చాం. అని చంద్రబాబు గుర్తు చేశారు.
CBN Call : 6,282 టీఎంసీల నీరు సముద్రం పాలు

విభజన తర్వాత పోలవరానికి ప్రత్యేక నిధులిచ్చారు, ప్రత్యేక చట్టం రూపొందించారు. గతేడాది సుమారు కృష్ణా, గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయి. గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి… గోదావరి నీళ్లను తెలంగాణ వాడుకున్నా అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అభ్యంతరం చెప్పలేదు. ప్రతేడాది గోదావరి నుంచి సముద్రంలోకి 3 వేల టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి. కృష్ణా-గోదావరి నదులు అనుసంధానం జరుగుతుంది.అని సీఎం వివరించారు.
CBN Call : నదులన్నీ అనుసంధానం చేద్దాం

ఏపీలోని నదులన్నింటినీ అనుసంధానించాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదు.ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి. అన్ని మాట్లాడ్డం లేదు.. ఐక్యత గురించే మాట్లాడతాను. నీటి విషయంలోనైనా, సహకారం విషయంలోనైనా తెలుగువారంతా కలిసి ఉండాలి. విలువలు నేర్పేది సంస్కృతి.. ఆ సంస్కృతి మూలం భాష.. అందుకే భాషాభివృద్ధికి నేను పూర్తి సహకారం ఇస్తాను. వివిధ దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులను, ఆస్థాన కవులను నియమించాలని కోరారు.. దానిపై నిర్ణయం తీసుకుంటాం. మాతృభాషాభివృద్ధికి, తెలుగు జాతి ఔన్నత్యానికి పూర్తిగా సహకరిస్తాం.
CBN Call : మన భాష, యాస మనకే ప్రత్యేకం.

గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తపాలా శాఖ కవర్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ… సినిమా ఈవెంట్లకు వచ్చినట్టుగా 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు పెద్ద ఎత్తున జనం రావడం సంతోషంగా ఉందన్నారు. మాతృభాషకు ఇచ్చే గౌరవ వందనమే ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ పేరుతో వేదిక ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. వందలాది భాషలు ఉన్నా… కేవలం ఆరు భాషలకు ప్రాచీన హోదా లభించింది.. అందులో తెలుగు ఉండడం గర్వకారణం. అని సీఎం చంద్రబాబు అన్నారు.
CBN Call 10 కోట్ల మంది తెలుగు బలం

ప్రపంచంలో 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు… ఈ సమావేశానికి కూడా 40 దేశాల నుంచి ప్రతినిధులు రావడం హర్షించదగ్గ విషయం. కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీశ్రీ, దా శరధి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాష కోసం పని చేశారు… తెలుగు వైభవం చాటారు. వేమన, సుమతీ, భాస్కర పద్యాలు మరిచిపోలేం. పిల్లలకు తెలుగు భాష పట్ల మమకారం పెంచేలా చేయాలి… తెలుగు భాష ఎక్కడికీ పోదు… శాశ్వతంగా ఉంటుంది. అన్నమయ్య, వెంగమాంబ, మొల్ల వంటి వారు భక్తి మార్గంలోనూ తెలుగుకు వెలుగు తెచ్చారు. విశ్వనాధ సత్యనారాయణ, సినారె, రావూరి భరద్వాజ వంటివారికి జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి. తెలుగును గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషకు తెచ్చేందుకు గిడుగు రామ్మూర్తి చేసిన కృషిని ఎన్నటికీ మరువలేం, అని సీఎం వ్యాఖ్యానించారు.
CBN Call : నేను తెలుగువాడిని.. నాది తెలుగుదేశం

నేను తెలుగువాడిని… నాది తెలుగుదేశం అని చాటిచెప్పిన ఎకైక నాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగు వారిని మద్రాసీలని పిలిచే రోజుల్లో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పోరాడి మరణించిన అమరజీవి పొట్టిశ్రీరాములను మరువలేం. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేందుకు… పదవిని త్యాగం చేసిన బూర్గుల కృష్ణారావు ఎప్పుడూ గుర్తుంటారు.

ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు కృషి చేసిన రామోజీరావును తెలుగు జాతి మరువదు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే భాషను కాపాడాలి. దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన పీవీ నరసింహారావు మన తెలుగువాడే. మన భాష, యాస, సంధులు, సమాసాలు, సామెతలు, పొడుపు కథలు మనకే ప్రత్యేకం. అందుకే దేశ భాషలందు తెలుసు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయులు తెలుగు భాషను కీర్తించారు. అని సీఎం చంద్రబాబు వివరించారు. ప్రపంచ మహాసభలకు హాజరైన ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తాం.
CBN Call : తెలుగు జాతికి రెండు రాష్ర్టాలు

తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో తెలుగు చదివే వారు ఉన్నారు.మాతృభాష అమ్మతో సమానం… మాతృ భాషలో చదువుకున్న వారి జీవితంలో రాణిస్తారు. ప్రపంచ మహాసభల సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం. వారికి అవార్డులు ఇవ్వడం శుభ పరిణామం. ఆంధ్ర సారస్వత పరిషత్ తెలుగు భాషకు, తెలుగు జాతికి చేస్తున్న మేలు అభినందనీయం… ఆంధ్ర సారస్వత పరిషత్ కు అండగా ఉంటాం. హిందీ తర్వాత ఎక్కవ రాష్ట్రాల్లో మాట్లాడే భాష తెలుగే. మాతృభాష మన మూలాలకు సంకేతం… ఇంగ్లిష్ అవసరమే కానీ. మాతృభాషను మరిస్తే.. మనల్ని మనమే మరిచిపోయినట్టు అవుతుంది. టెక్నాలజీ వల్ల తెలుగు భాష కనుమరుగవుతుందనే భయం వద్దు. టెక్నాలజీ వల్ల తెలుగు భాషను కాపాడుకోవడం చాలా సులభం. రాజమండ్రిలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని ప్రబోధించారు… నేను ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని పిలుపు ఇచ్చాను. తెలుగు జాతికి నేను శాశ్వతంగా రుణపడి ఉంటాను. తెలుగు జాతి కొన్ని సందర్భాల్లో కలిసి ఉన్నాం.. కొన్ని సందర్భాల్లో విడిగా ఉన్నాం… ఇప్పుడు మళ్లీ తెలుగు జాతికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగుజాతికి అభివృద్ధికి నేను కృషి చేస్తాను.

CBN Call : మారిషస్ లో 4వ తెలుగు ప్రపంచ మహాసభ
ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టిన వ్యక్తి పీవీ నరసింహారావు అయితే… ఆ రోజుల్లో ఐటీని అందిపుచ్చుకున్న ఘనత తెలుగు జాతిదే. దేశంలో ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలి. ఏ భాష ఎక్కువా, తక్కువ కాదు. మాతృభాషలో అభ్యసించిన వారే అత్యంత ప్రతిభావంతులవుతారు. తెలుగు భాష కోసం కృషి చేస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్ సేవలు అభినందనీయం. 4వ ప్రపంచ తెలుగు మహాసభలను మారిషస్‌లో నిర్వహించడం సంతోషదాయకం హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే భాష తెలుగే. మాతృ భాషలో రాణిస్తే దేనిలోనైనా రాణించవచ్చు టెక్నాలజీతో భాష కనుమరుగు కావటం లేదు. భాషను కాపాడుకోవటం మరింత సులభం అవుతుంది. త్యాగధనుల్ని జాతి నిరంతరం గుర్తించుకునేలా వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తాం. ఆత్మగౌరవం అని అన్న ఎన్టీఆర్ పిలుపు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడుతున్నాను అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
CBN Call : తెలుగు ఔన్నత్యాన్ని చాటాం

తెలుగు భాష ఔనత్యాన్ని, గొప్పదనాన్ని, ఉనికిని చాటి చెప్పడం లో తెలుగు మహాసభలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. తెలుగు భాషను, తెలుగు దేశం పార్టీని విడదీయలేము. తెలుగుదేశం ఆవిర్భావం తరువాతే మన అమ్మ భాషకు ప్రపంచ స్దాయి అన్న నందమూరి తారకరామారావు. గుర్తింపు తీసుకొచ్చారు. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు తెలుగు వారంటే, మద్రాసీలు, సాంబారీలు అనే పిలిచేవారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని, ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారకరామారావు. తెలుగువారి ఆత్మ విశ్వాశాన్ని చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్తున్నాను అని రామానాయుడు తెలిపారు.
ALSO READ : : AP Delimitation : నెల్లూరులోనే గూడూరు Andhra Prabha Real News
