KTR | బాధిత కుటుంబాలకు పరామర్శ
KTR | బాధిత కుటుంబాలకు పరామర్శ
KTR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శంషాబాద్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి అర్పించారు. శుక్రవారం శంషాబాద్ సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. సిరిసిల్లకు చెందిన బీఆర్‌ఎస్ నేతలు ఇద్దరు సహా వారి కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్న కేటీఆర్ మృతదేహాలను పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. మృతదేహాలను సిరిసిల్లకు తరలించేందుకు రెండు అంబులెన్సులు ఏర్పాటు చేయించారు.

