ప్లాస్టిక్ రహిత సమాజం కృషి

కమ్మర్ పల్లి గ్రామ సర్పంచ్ హారిక అశోక్
కమ్మర్ పల్లి, మే 14 ( ఆంధ్ర ప్రభ ):- ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ కమ్మర్ పల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్,ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ పేర్కొన్నారు.ప్లాస్టిక్ రహిత గ్రామాన్నీ నిర్మించాలనే లక్ష్యంతో గురువారం జూట్ బ్యాగులను తయారు చేయించి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా,ప్రజల్లో అవగాహన కల్పిస్తూ..నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జూట్ బ్యాగులను వెంట తీసుకెళ్లాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏనుగంధుల గంగజమున, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
