వారణాసికి వెళ్లిన వికారాబాద్ భక్తులు

వారణాసికి వెళ్లిన వికారాబాద్ భక్తులు
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన భక్తులు వారణాసి కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుండి బయలుదేరిన వారు వారణాసి కాశీ విశ్వనాథుని దర్శించుకుని గంగా హారతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాశీ విశ్వనాథుని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. 50 రోజుల్లో అందరికీ మంచి జరగాలని తమ ఆకాంక్షిస్తున్నట్టు వారు వెల్లడించారు. కాశీ వెళ్లిన వారిలో మేనక చౌహాన్ తదితరులు ఉన్నారు.
