Awareness | రాంగ్ పార్కింగ్, ఓవర్ స్పీడ్‌కు చెక్

Awareness | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన అరైవ్–అలైవ్ క్యాంపెయిన్–2026 కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని పట్టణంలో ట్రాఫిక్ నియమాలపై ఈ రోజు ప్రజలకు అవగాహన కల్పించారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని జీఎం కార్యాలయం టర్నింగ్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఎస్‌ఐ అనూష మాట్లాడుతూ… రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. రాంగ్ పార్కింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలను నివారించాలంటే వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
