బండి భగీరథ్ వ్యవహారంపై ఆగ్రహం
బండి భగీరథ్ వ్యవహారంపై ఆగ్రహం
ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : బండి భగీరథ్ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదైనప్పటికీ దర్యాప్తులో జాప్యం ఎందుకు జరిగిందని పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఫిర్యాదు వచ్చిన తర్వాత కూడా చర్యలు ఆలస్యం కావడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు అందినప్పటికీ విచారణ వేగంగా ముందుకు సాగకపోవడంపై సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది.
కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.
