ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన నందమూరి రామకృష్ణ
ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన నందమూరి రామకృష్ణ
వత్సవాయి, ఆంధ్రప్రభ : మండలం, లింగాల గ్రామంలో నందమూరి తారక రామారావు తనయులు నందమూరి రామకృష్ణ పర్యటన సందర్భంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తొండపు దశరథ జనార్దన్ అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని, రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే గ్రామంలోని గోశాలను సందర్శించి అక్కడి నిర్వహణను పరిశీలించి గోమాతల సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తొండపు దశరథ జనార్దన్ కి, నందమూరి రామకృష్ణకి ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

