ipl2may | చెన్నై, ముంబై మ‌ధ్య కీల‌క మ్యాచ్‌

ipl2may | చెన్నై, ముంబై మ‌ధ్య కీల‌క మ్యాచ్‌

రెండు జ‌ట్ల‌కు డూ ఆర్‌డై
చెన్నై 8 మ్యాచులు ఆడి 3 గెలిచింది.
ముంబై 8 మ్యాచులు ఆడి 2 గెలిచింది.
చెన్నై వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్‌లో లైవ్‌

ipl2may | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఈ రోజు మరో ర‌స‌వ‌త్త‌ర పోరు జరగనుంది. ఇవాళ చెన్నై, ముంబై జ‌ట్లు ఢీకొన‌నున్నాయి. చెన్నై వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రోజు జ‌రిగే మ్యాచ్ ఈ రెండు జ‌ట్ల‌కు కీల‌క‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ సీజ‌న్‌లో ఈ రెండు జ‌ట్ల ఆట‌తీరు నాసిర‌కంగా ఉంది. వ‌రు ప‌రాజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో వెనుక‌బ‌డ్డాయి. ఐదు సార్లు ఛాంపియన్ అయిన ఈ జ‌ట్లు ఇంత దారుణంగా విఫ‌ల‌మ‌వుతుండ‌టం ఆ జ‌ట్ల అభిమానుల‌కు మింగుడుప‌డ‌టం లేదు. ఈ రోజు మ్యాచులో ఓడిపోయిన జ‌ట్టు దాదాపు ఇంటి బాట ప‌ట్టే అవ‌కాశం ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడగా… మూడు గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. ఇంకా ముంబై ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. ఎనిమిది మ్యాచులు ఆడిన ముంబై.. కేవలం రెండు మాత్రమే గెలిచి.. 9వ స్థానంలో కొనసాగుతోంది. ముంబై కీల‌క ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ‌, చెన్నై సూప‌ర్ స్టార్ మహేంద్ర‌సింగ్ ధోని గాయాల‌తో దూరంగా ఉండ‌టం కూడా ఆ జ‌ట్ల‌కు ప్ర‌తికూలంగా మారింది. ఇవాళ జరిగే మ్యాచ్‌లో వారిద్ద‌రూ ఆడుతార‌నే స‌మాచారం ఉంది.

Leave a Reply