Tirumala26june26 | తిరుమలలో భక్తుల కిట‌కిట

Tirumala26june26 | తిరుమలలో భక్తుల కిట‌కిట

Tirumala26june26 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : శ్రీవారిని గురువారం మొత్తం 62,925 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,297 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదే రోజు శ్రీవారి హుండీ ద్వారా రూ.3.77 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.

శ్రీవారి ప్రసాదంగా భావించే లడ్డూలకు కూడా భారీ డిమాండ్ కొనసాగుతోంది. గురువాం ఒక్కరోజే 4.23 లక్షల లడ్డూలు విక్రయమైనట్లు అధికారులు తెలిపారు. అలాగే అన్నప్రసాదాన్ని 2.40 లక్షల మంది భక్తులు స్వీకరించినట్లు వెల్లడించారు. అలాగే భక్తుల్లో 2,910 మందికి మెడికల్ ట్రీట్మెంట్ చేసినట్టు తెలియచేశారు.

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ గురువారం పూర్తిగా భక్తులతో నిండిపోయింది. బయట వెయిట్ చేస్తున్న లైన్ బాటా గంగమ్మ టెంపుల్ వరుకు ఉంది. టోకెన్లు లేకుండా సర్వదర్శనం కోసం క్యూలైన్‌లో ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పొందేందుకు సుమారు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.