KTR | కాంగ్రెస్, బీజేపీని ప్రజలు నమ్మరు
KTR | కాంగ్రెస్, బీజేపీని ప్రజలు నమ్మరు
KTR | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఫస్ట్‌ఆఫ్ అట్టర్ ఫ్లాప్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజ్‌గిరిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలన “ఫస్ట్‌ఆఫ్ అట్టర్ ఫ్లాప్”గా మారిందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్ పాలనను విమర్శించని వారు లేరని, కాంగ్రెస్ సినిమా ఇప్పటికే ఇంటర్వెల్ దాటిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రూ.15 వేల ఆర్థిక సాయం, మహిళలకు తులం బంగారం వంటి అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని గ్యారెంటీ కార్డు ఇచ్చారని, అయితే 100 రోజులు కాదు 900 రోజులు గడిచినా హామీలు నెరవేరలేదని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు లేకుండా పాలన సాగిందని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే 61వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పేదలకు అందించామని తెలిపారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలను విశ్వసించడం లేదని, నగరాభివృద్ధికి బీఆర్‌ఎస్ చేసిన కృషిని ప్రజలు గుర్తుంచుకున్నారని కేటీఆర్ అన్నారు.
