తహశీల్దార్‌కు వినతి..
నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్ పెట్(Gopal Petలో నివాస గృహాల సముదాయం సమీపంలో కొనసాగుతున్న వైన్స్ షాప్‌ను తొలగించాలని కోరుతూ కాలనీ వాసులు తహశీల్దార్(Tehsildar)కు వినతిపత్రం సమర్పించారు. కాలనీకి దగ్గరలో వైన్స్ షాప్ కొనసాగుతున్న సందర్భంగా మద్యం సేవించి నివాస గృహాల సమీపంలో మూత్ర విసర్జన చేస్తుండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు.
కాలనీ మహిళలు(Gopal Pett, Tehsildar, Women) సాయంత్రం వేళ పొలం పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకుంటున్నసమయంలో మద్యం ప్రియులు దారి ఇవ్వకుండా ఇబ్బందులు కలుగజేస్తున్నారని పేర్కొన్నారు. కొందరు మద్యం సేవించి మతి తప్పి ఇళ్ళ సమీపంలోనే నిద్రిస్తున్నారని వినతిపత్రం(Petitioner) లో పేర్కొన్నారు. అందువల్ల అట్టి మద్యం దుకాణాన్ని(Liquor Shop) తొలగించి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు.
కాలనీ వాసులు సమర్పించిన వినతి పత్రం విషయాన్నిజిల్లా కలెక్టర్(Collector)కు పంపిస్తానని తహశీల్దార్ శ్రీనివాస్ రావు(Srinivas Rao) తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఫారీద్, లక్ష్మీ కాంతం, తదితరులు పాల్గొన్నారు

