కృష్ణా అండర్-23 మహిళల జట్టుకు రంగలక్ష్మి సారథ్యం
కృష్ణా అండర్-23 మహిళల జట్టుకు రంగలక్ష్మి సారథ్యం
17 మంది ప్రధాన జట్టు, నలుగురు స్టాండ్‌బై ఆటగాళ్ల ఎంపిక
విజయవాడ, ఆంధ్రప్రభ: ఈ ఏడాది క్రికెట్ సీజన్‌లో ప్రాతినిధ్యం వహించనున్న కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (కేడీసీఏ) అండర్-23 మహిళల జట్టును ఖరారు చేశారు. జట్టుకు పి. రంగలక్ష్మిని కెప్టెన్‌గా నియమిస్తూ 17 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ప్రకటించినట్లు కేడీసీఏ కార్యదర్శి ఎం. రవీంద్ర చౌదరి గురువారం తెలిపారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ఎంపిక చేసి జట్టును రూపొందించినట్లు పేర్కొన్నారు. రాబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో కృష్ణా జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబర్చి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రధాన జట్టులో ఎండీ మెహక్, ఎండీ ముస్ఖానా, ఎండీ అంజుమ్, వి. అక్షయ, ఎం. పూజిత, టి. గుణచందిక, టి. నివేదిత, ఎం. సృజ్జన, ఏ. లక్ష్మణ అపర్ణ, వి. గాయత్రిదేవి, బి. పుష్ప, ఏ. రాణి, వి. వేణు మాధవి, ఎం. లేఖన, ఛే. ధనశ్రీ, కె. కీర్తి చోటు దక్కించుకున్నారు.
స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఆర్. చేతన ప్రియా, బి. శ్రావంతి, జేఎన్‌ఎస్‌ఎస్ యశస్విని, బి. తమిళికలను ఎంపిక చేశారు. జిల్లాలో మహిళా క్రికెట్ అభివృద్ధికి ఈ ఎంపికలు దోహదపడతాయని, ఎంపికైన క్రీడాకారిణులు క్రమశిక్షణతో సాధన చేసి జిల్లాకు విజయాలు అందించాలని క్రీడా వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.
