శానిటేషన్ వైఫల్యం.. స్థానికుల ఆగ్రహం..
- పాయకాపురంలో దుర్వాసనతో జనం ఆగ్రహం..
- సైడ్ కాల్వపై శానిటేషన్ వైఫల్యం ఆరోపణలు
- చెత్తతో నిండిన కాల్వ..
- దోమలు, ఈగలతో ప్రజలకు ఇబ్బందులు
పాయకాపురం, ఆంధ్రప్రభ : స్థానిక 61వ డివిజన్ ప్రాంతంలోని ప్రధాన సైడ్ కాల్వలో చెత్త వ్యర్దాలు పేరుకుపోయి ఉన్నాయి. ఈ వ్యర్దాలపై ఈగలు దోమలు ఆవాసాలుగా మారి ఉన్నాయి. ఈ వ్యర్ధాల వలన దుర్గంధం వెదజల్లుతున్నాయి ఈ ప్రాంతంలో మాంస చేపల దుకాణాలు ఉండటంవల్ల వాటి వ్యర్థాలను కాలవలో పడవేయడం వలన సైడ్ కాలవలో అవి పేరుకుపోయి రకరకాల క్రిమి కీటకాలకు ఆవాసాలుగా మారాయి.
వీటి వలన పలు రోగాలు వ్యాప్తి చెందుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఇది ఎలా ఉంటే సైడ్ కాలంలో మురుగు తీయడం లేదని స్థానికుల వాదనగా ఉంది సంబంధిత శానిటేషన్ వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. నున్న నూజివీడు వెంబడి ప్రధాన సైడ్ కాలవలో మురుగునీరు అదోరకమైన రంగుతో కనబడుతున్నది.
జంతు వ్యర్ధాలు కావులో మాంస దుకాణ వ్యాపారులు వేయడం వలన ఈ రంగు కు మురుగునీరు వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. పేరుకు మాత్రమే స్వచ్ఛ్ ఆంధ్ర పరిసరాలు పరిశుభ్రత అని శానిటేషన్ అధికారులు బిల్డప్ ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
