రూ.5.15 లక్షల ఎల్‌ఓసీ ఆమోద పత్రం అందజేత
రూ.5.15 లక్షల ఎల్‌ఓసీ ఆమోద పత్రం అందజేత
పాయకాపురం, ఆంధ్రప్రభ:
కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తి, వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోతే ప్రభుత్వం ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా వైద్య ఖర్చులను భరిస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో స్థానిక 25వ డివిజన్ ఆరండల్‌పేట ప్రాంతానికి చెందిన మొరం వెంకటేశ్వరరావుకు వైద్య సహాయం అందించారు.
నరాల బలహీనత కారణంగా మొరం వెంకటేశ్వరరావు అపస్మారక స్థితిలో ఉండటంతో, ఆయన కుటుంబ సభ్యులు డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మాచర్ల గోపినాథ్ పవనికి విషయం తెలియజేశారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, మొరం వెంకటేశ్వరరావు వైద్య చికిత్స కోసం ఎల్‌ఓసీ ద్వారా రూ.5 లక్షల 15 వేల విలువైన ఆమోద పత్రాన్ని అందజేశారు.
ప్రభుత్వం అందిస్తున్న వైద్య సహాయ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
