డీటీఎఫ్ నూతన మండల కమిటీ ఎన్నిక

డీటీఎఫ్ నూతన మండల కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా కే. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎం. శివకుమార్ ఎన్నిక

రేగొండ, ఆంధ్రప్రభ: డీటీఎఫ్ రేగొండ మండల నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించగా, అధ్యక్షుడిగా కే. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎం. శివకుమార్ ఎన్నికైనట్లు మండల ఎన్నికల అధికారి ఇప్పకాయల వీరేశం ప్రకటించారు.

మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి మాట్లాడారు. ఉద్యోగులకు అందించాల్సిన హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు, విధి విధానాలు రూపొందించకముందే ఉపాధ్యాయ, ఉద్యోగుల మే నెల జీతాల నుంచి 1.5 శాతం చొప్పున కోత విధించడం సరికాదన్నారు.

కోత విధించిన మొత్తాన్ని తిరిగి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శులు ఇప్పకాయల వీరేశం, చేరి ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. నూతన కమిటీలో వైస్ ప్రెసిడెంట్లుగా ఎం. సురేష్, జే. వనిత, కే. మురళి ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా ఏ. శ్రీనివాస్, ఎస్. ప్రవళిక, జె. శ్రీనివాస్, బి. లావణ్య ఎన్నికైనట్లు తెలిపారు.

జిల్లా కౌన్సిలర్లుగా పి. దేవేందర్ రెడ్డి, కే. సునీత, పి. భద్రయ్య, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా పి. తిరుమల, మండల కమిటీ సభ్యురాలిగా ఎన్. మౌనిక ఎన్నికైనట్లు వెల్లడించారు.