ద్వారకపై దండయాత్ర.. రహస్య మాయా శక్తి

ద్వారకపై దండయాత్ర.. రహస్య మాయా శక్తి

సాక్షాత్తు శ్రీమహావిష్ణువు యొక్క మాయల మాయను కల్పించగలిగిన సమర్జుడు అయిన శ్రీకృష్ణుడు, యుద్ధం లో తనపై రప్పించబడిన మాయలో పడిన సందర్భం ఒకటి. మహాభారతంలో కనపడుతుంది.

ధర్మరాజు రాజసూయం చేసిన వాటికి, జూదంలో తన రాజ్య భాగం సకల సంపదలను పోగొట్టుకుని సోదరులు, భార్యతో సహా ఆరణ్య వాసానికి వెళ్ళే నాటికి నడుమ పడి నెలల కాలం గడిచిపోయింది. ఆ దీర్ఘ కాలంలో శ్రీకృష్ణుడు పాండవులకు అందుబాటులో లేదు. ద్వారక మీదికి దండెత్తి వచ్చిన పాల్యుడితో యుద్ధంలో ఆ తీవ్రమైన యుద్ధకాలం గడిచింది.

ద్వారకలో ఉండగా అదెలా సాధ్యమైంది అని విస్తుపోయాడు శ్రీకృష్ణుడు. తీవ్రమైన కలతకు మనసు లోను కాగా, శోకవిహ్వలుడయ్యాడు. చేతిలోంచి ధనుస్సు జారి పడిపోయింది. రథంపై కూలబడిపోయాడు. అలా శోకంలో చిక్కుకున్న శ్రీకృష్ణుడిని చూసి వీరులు ఆశ్చర్యపోయారు. సాల్వుడు పన్నిన ఆ భయంకర మాయ లోంచి తేరుకోవడానికి శ్రీకృష్ణుడికి కొంత సమయం పట్టింది.

మాయ లోంచి బయటపడిన తరువాత, ఎదురుగా చూస్తే అక్కడ సాంభక మనే సాల్యుడి రథం లేదు. ఆ రథంపై స దేవుడూ లేదు. శివుడి వరప్రభావలబ్దమైన సాల్వుడి మాయా ప్రభావానికి లోనవడం జరిగిందని అర్థమయింది శ్రీకృష్ణుడికి. శ్రీకృష్ణుడు అలా సాల్వుడు పన్నిన యుద్ధమాయలోంచి బయటపడుతున్న సమయంలోనే సాల్యుడు పెద్ద పెద్ద బండరాళ్ల వర్షం కురిపించాడు. శ్రీకృష్ణుడిపై వజ్రాయుధం ప్రయోగించి వాటన్నిటినీ ముక్కలు చేసి పిండి చేశాడు.

చింతన
దమఘోషుడు చేది దేశానికి రాజు, పసుదేవుడి చెల్లెలైన ప్రతశ్రవ ఆయన భార్య. శిశుపాలుడు వీరికి కలిగిన సంతానం. ధర్మరాజు చేసిన రాజసూయం ముగింపు కార్యంలో శిశుపాలుడు శ్రీకృష్ణుడి చేతిలో మరణించగా, అప్పటి నుండి శ్రీకృష్ణుడిపై కక్ష పెంచుకున్న శిశుపాలుడి తమ్ముడైన సాల్యుడు, శివుడిని గురించి చేసిన తపస్సు ద్వారా అసాధారణ మాయాశక్తిని పొందాడు. తన ఇచ్చానుసారంగా ప్రయాణించి, ఎక్కడైనా నిలిచే సాంభక మరే విమానాన్ని వరాలుగా పొందాడు. ఆ వరముల బలంతో ద్వారక మీదికి దండెత్తాడు.

సాల్యుడు శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడితో మొదట యుద్ధం చేశాడు. పరాజయం పొంది తన నగరానికి పారిపోయాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు సాల్వుడిపైకి సేనతో వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సేనతో రావడాన్ని విని భయంతో సముద్రగర్భంలో దాక్కున్నాడు సాల్వుడు. సముద్రం గర్భంలో ఉండి యుద్ధం సాగించాడు. ఆ యుద్ధంలో మాయా ప్రహారం చేశాడు. శ్రీకృష్ణుడు ఆ మాయా ప్రభావానికి లోనయ్యాడు.

ఆ మాయలో భాగంగా సాల్వుడి చేతిలో పసుదేవుడు చిక్కాడని, త్వరగా వెళ్ళి రక్షించుకొమ్మని ద్వారక నుండి ఒక మనిషి వచ్చి చెప్పినట్లుగా భ్రమ కల్పించాడు. ఆ మోసపూరిత మాయ ప్రభావానికి పాల్పడిన శ్రీకృష్ణుడు, ఆకాశంలో సాల్వుడి రథమైన సాంభమం మీద సకల శోభను పోగొట్టుకున్న స్థితిని చూశాడు.

శ్రీకృష్ణుడి రథసారధియైన దారకుడు ఇక చూస్తూ ఊరుకోలేక “స్వామీ! ఇంకా ఎందుకు సాల్వుడి పట్ల ఉపేక్ష భావం కనబరుస్తున్నారు. యుద్ధంలో ఏ మహావీరుడైనా శత్రువు అల్పుడు కదా అని విడిచిపెడతావా? వీడిని యమ పురికి తక్షణమే పంపించండి!” అని సమయోచిత సలహా ఇచ్చాడు.

రథి–సారథుల మధ్య ఇటువంటి సంబంధం ఉండడం ఉత్తమమని మహాభారతం ఈ సౌంభకాఖ్యానంలో ప్రత్యేకించి చెప్పింది. దారకుడి సలహాను అంగీకరించిన శ్రీకృష్ణుడు, సుదర్శన చక్రం ప్రయోగించి సాల్వుడిని సమూలంగా సంహరించాడు.

-భట్టు