చలివేంద్రాన్ని ప్రారంభించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు..
చలివేంద్రాన్ని ప్రారంభించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు..
తోట్లవల్లూరు – ఆంధ్రప్రభ : తోట్లవల్లూరులో కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్, కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ, కేడీసీసీ బ్యాంక్ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు శుద్ధమైన చల్లని తాగునీరు అందించడం అభినందనీయమన్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి, రైతులు, మహిళలు, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తూ కెడీసీసీ బ్యాంకును ప్రజలకు మరింత చేరువ చేస్తున్న నాయకత్వం నెట్టెం రఘురాం గారిదేనని కొనియాడారు. ప్రజాసేవలో ఆయన చూపుతున్న అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగుతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కెడీసీసీ బ్యాంక్ మేనేజర్ పి. దీపిక, సూపర్వైజర్ ఈ. శివ నాగ రాజు, పాక్స్ అధ్యక్షులు, బ్యాంక్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
