పండుగ వాతావరణంలో మహానాడు వేడుకలు

పండుగ వాతావరణంలో మహానాడు వేడుకలు
పెనమలూరు, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు తాడిగడపలో రెండు రోజుల పాటు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. తాడిగడప నాలుగో క్లస్టర్ ఇన్‌చార్జి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రామ్‌కుమార్ ఆధ్వర్యంలో హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడు సమావేశాలను భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. నాయకుల ప్రసంగాలను కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు.
మహానాడు సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజల్లోకి వెళ్లే విధానం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై సీనియర్ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహానాడు చివరి రోజు సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావుకు నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సతీమణి బోడె హైమ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆమె తెలిపారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని బోడె హైమ అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను సమానంగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు.
